18, జులై 2013, గురువారం

పరిచయం

జీవశాస్త్రం తరగతులు అయిపోయాక ఇంటికి ఎవరితో వెళ్లాలో తెలియలేదు.ఎందుకంటే అందరూ రైలులో వెళ్తారుట.

మేము మొదటిసారి మా గదిలో ఏడుగురు ఉండటం.చాలా ఖాళీ ఉంది.అందరూ ఇంచుమించు తూర్పు గోదావరి వాళ్ళే.నేనైతే ఎప్పుడూ ఒంటరిగా ఇంటికి వెళ్ళలేదు.ఎప్పుడూ మా పక్క ఊరి అమ్మాయితో వచ్చేదాన్ని,కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏ సబ్జెక్టు తీసుకోకుండా ఇంటి దగ్గర ఉండిపోయింది.

జీవశాస్త్రం తరగతిలో ఒకమ్మాయి ఉంది.తనని చూస్తే ఎక్కడో చూసినట్టు,తనది మాఊరే అయినట్టు అనిపించేది.అడగాలా వద్దా అని చాలా ఆలోచించాను,ఎందుకంటే నాకు కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే చాలా చాలా భయం.ఒకరోజు ఉండబట్టలేక అడిగాను,మీదేఊరని.పాలకొల్లు అని చెప్పింది.మాదీ పాలకొల్లే నని చెప్పాను.తను నాపేరు అడిగింది,చెప్పాను.


అంతా అయ్యేక నాకు తెలిసిందేంటంటే తను నాకు చాలా విధాలుగా పరిచయం.తను,నేను రెండవతరగతి వరకూ కలిసి చదుకున్నాం.(మాంటిస్సోరి ఆంగ్ల మాధ్యమ పాఠశాల,ఉల్లంపర్రు)కానీ పరిచయం లేకపోవడానికి కారణం ఇద్దరూ వేరువేరు సెక్షన్లు.

వాళ్ళ అమ్మగారు నేను చదివిన మున్సిపల్ ప్రాధమికోన్నత పాఠశాలలో టీచరుగా పనిచేశారు.

మా చెల్లి స్నేహితురాలి నాన్నగారు,తను చదివిన పాఠశాలలో టీచరు.

ఇలా తను నాకు పరిచయం.ఇంతకీ తనపేరు చెప్పలేదు కదూ.రమ్య హారిక.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...