16, నవంబర్ 2014, ఆదివారం

Ek Cup Chya-Movie


               ప్రతీ శనివారం సాయంత్రం 6.30 కి DDభారతి లో బహుమతులు పొందిన భారతీయ చలన చిత్రాలు ప్రసారం చేస్తున్నారు.అందులో నిన్న "Ek cup Chya"(2009) అనే మరాఠీ సినిమా వేసారు.సమాచార హక్కు చట్టం పై తీసిన సినిమా అది.


                ఒక బస్ కండక్టర్ కొంకణ్ తీరంలో తన కుటుంబంతో(భార్య,తల్లి,ఇద్దరు కొడుకులు,ఇద్దరు కుమార్తెలు)నివసిస్తుంటాడు.ఒక రోజు వారికి కరెంటు బిల్లు ఏకంగా 73,000 రూపాయలు వస్తుంది.సాధారణ కుటుంబమైన వారికి అంత మొత్తం ఎలా కట్టగలరు.అసలు సమస్యేంటో కనుక్కుందామని విద్యుత్ కార్యాలయానికి వెళ్తాడు.అక్కడ అందరూ ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే ఆ డబ్బులు కట్టెయ్యమని.కానీ తను ఎలా కట్టగలడు.అంతే కాకుండా పాత బిల్లులు తీసుకురమ్మంటారు.అవి వారి దగ్గర ఉండవు.చాలా ఒత్తిడికి లోనవుతాడు.భార్య అతణ్ణి ఓదారుస్తుంది. తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఆపేస్తారు.పై అధికారికి దరఖాస్తు చేస్తే దాన్ని వారు పట్టించుకోరు.తన రెండో కొడుకు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్తాయి.
ఇంతలో తనతో పని చేసే బస్సు డ్రైవరు సహాయంతో సమాచార హక్కు చట్టం ద్వారా పల్లె ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న ఒక లేడీ డాక్టరు ను కలుసుకుంటాడు.ఆమె ద్వారా ఆ చట్టం గురించి తెలుసుకుని,దరఖాస్తు చేస్తాడు.


               చివరికి అతని ఇంటికి విద్యుత్ వస్తుంది.నాలుగు నెలలు నూనె దీపంలో చదువుకున్న రెండో కొడుకు పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలుస్తాడు.
సినిమా నాకు చాలా చాలా నచ్చింది.సాధారణమైన కుటుంబంలో ఉండే ప్రేమాభిమానాలను బాగా చూపించారు.అందరూ తప్పక చూడవల్సిన సినిమా అనిపించింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...